రాష్ట్రంలో ఎస్సీలపై జగన్ రెడ్డి దమనకాండ సృష్టిస్తూ... అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చట్టంపై భయం లేకుండా జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఎస్సీ యువకుడు కిరణ్ తల్లిదండ్రులు లోకేశ్‌ను ఆయన నివాసంలో కలిశారు. తమ బిడ్డ మరణానికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా..కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 7 నెలలుగా పోరాడుతున్నా.. ఎలాంటి న్యాయం జరగలేదని వారు లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా అధికారం చేపట్టాక ఏ ఒక్క కేసులోనూ ఎస్సీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదు. కిరణ్‌కు జరిగిన అన్యాయం రాష్ట్రంలో మరెవ్వరికీ జరగకూడదు. కిరణ్ తల్లింద్రుల పోరాటానికి తెదేపా అండగా ఉంటుంది. అన్ని విధాలుగా వారిని ఆదుకుంటాం. న్యాయ పోరాటం చేస్తూ బాధ్యులకు శిక్షపడేలా చేస్తాం. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం, ఎస్సీ కమిషన్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి