ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh: అలాంటి ప్రకటన ఇచ్చిన ఘనుడు జగన్ మాత్రమే: లోకేశ్‌

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చమురు ధరలపై మాట్లాడిన జగన్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా వ్యాట్ ఎందుకు తగ్గించలేదని తెదేపా నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్​పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ రెడ్డి ఒక్కడేనని ఎద్దేవా చేశారు.

అలాంటి ప్రకటన ఇచ్చిన ఘనుడు జగన్ మాత్రమే
అలాంటి ప్రకటన ఇచ్చిన ఘనుడు జగన్ మాత్రమే

By

Published : Nov 7, 2021, 6:12 PM IST

Updated : Nov 7, 2021, 8:04 PM IST

పెట్రోల్, డీజిల్​పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ రెడ్డి ఒక్కడేనని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. "కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా..వసూల్ రెడ్డి మాత్రం బాదుడు విషయంలో వెనక్కి తగ్గనంటూ ప్రకటనలు ఇవ్వటం ఆయన తుగ్లక్ తనానికి నిదర్శనం" అని మండిపడ్డారు. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైకాపా ప్రభుత్వం అభాసు పాలయ్యిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రజలపై భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్​ని రూ.2కి తగ్గించిన విషయాన్ని దాచిపెట్టి ఫేక్ ప్రకటన ఇవ్వటం దారుణమన్నారు. యానాం వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటే తేడా తెలుస్తుందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన జగన్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా వ్యాట్ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. కేవలం రూ.1 సెస్ వేసామంటూ అసత్యాలు చెబుతున్నారన్నారని మండిపడ్డారు.

2020 ఫిబ్రవరి 29న పెట్రోలుపై అదనపు వ్యాట్‌ను రూ.2.76, డీజిల్‌పై రూ.3.07కు పెంచారన్నారు. 2020 జులై 20న మరోసారి పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 వరకూ అదనపు వ్యాట్‌ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారన్నారు. 2020 సెప్టెంబరు 18న రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటరు రూ.1 చొప్పున విధించారని గుర్తు చేశారు. మళ్లీ దానిపైనా వ్యాట్‌ ఉందని..,మొత్తంగా, లీటర్ పెట్రోల్​పై రూ.30 వరకూ, డీజిల్​పై రూ.22 వరకూ పన్నులు రూపంలో బాదుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. గత ఏడాదితో పోల్చుకుంటే, పెట్రోల్​పై రూ.7.59, డీజిల్​పై రూ.5.46 వరకు పన్నుల రూపంలో వైకాపా ప్రభుత్వం అధికంగా బాదేసిందని కేంద్రమే చెప్పిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అధికంగా జనాల్ని దోచేస్తున్న జగన్..ఫేక్ ప్రకటనలు మాని తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: CBN: పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రపై ఉక్కుపాదం: చంద్రబాబు

Last Updated : Nov 7, 2021, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details