ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన 'చలో తాడేపల్లి' కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించటంపై తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోగా నిరుద్యోగ యువతని బెదిరించే విధంగా గుంటూరు ఎస్పీ మాట్లాడటం..,కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని చెప్పటం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని ట్వీటర్ వేదికగా మండిపడ్డారు.
"కొంతమంది పోలీస్ అధికారులు వైకాపా బానిసలుగా బ్రతుకుతున్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చెయ్యాల్సిన వారు రాజారెడ్డి రాజ్యాంగానికి సలామ్ కొడుతున్నారు. ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. దానిని కాలరాసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?. శాశ్వతంగా సీఎం నివాసం వద్ద 144 సెక్షన్ పెట్టడమే తప్పైతే..,నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదంటూ పోలీసులు మరో పెద్ద తప్పు చేస్తున్నారు. వైకాపా కండువా కప్పుకొని జగన్‌కి గులాంగిరి చేస్తున్న అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులను కాపాడటానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందని గుర్తుపెట్టుకోవాలి." -ట్వీటర్లో లోకేశ్
ఏం జరిగిందంటే..
కొత్త జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఎల్లుండి (సోమవారం) 'చలో తాడేపల్లి' కార్యక్రమాన్ని తలపెట్టారు. తక్షణమే జాబ్ లెస్ కాలెండర్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో నూతన జాబ్ కాలెండర్ను విడుదల చేయాలన్నారు. లేకుంటే నిరుద్యోగులు వేలాదిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
విద్యార్థులకు ఎస్పీ ఆరిఫ్ హెచ్చరిక..