'అన్యాయాలు, అరాచకాలు బయటపెడుతున్నందుకే అరెస్టులు'
వైకాపా అరాచకాలు, అన్యాయాలను బయటపెడుతున్నందుకు జగన్ కక్షసాధింపు చర్యలకు తెరలేపారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అందులో భాంగగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని మండిపడ్డారు.
'అన్యాయాలను, అరాచకాలు బయటపెడుతున్నారనే అరెస్టులు'
కక్షసాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అరాచకాలు, అన్యాయాలను బయటపెడుతున్నందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అరెస్టు కక్షసాధింపు కాదా? అని ప్రశ్నించారు. బీసీలకు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారన్నారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు.