ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అభివృద్ధిపై ప్రశ్నిస్తే చంపేసే నయా నింయత జగన్: లోకేశ్ - జగన్​పై లోకేశ్ కామెంట్స్

అభివృద్ధిపై ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్​రెడ్డి అంటూ తెదేపా నేత లోకేశ్‌ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించిన వెంగయ్య అనే వ్యక్తిని చంపేశారని మండిపడ్డారు.

అభివృద్ధిపై ప్రశ్నిస్తే చంపేసే నయా నింయత జగన్
అభివృద్ధిపై ప్రశ్నిస్తే చంపేసే నయా నింయత జగన్

By

Published : Jan 19, 2021, 3:53 PM IST

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించిన వెంగయ్య అనే వ్యక్తిని చంపేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్​రెడ్డి అంటూ లోకేశ్‌ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

రూ.25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్‌ని చంపేశారన్నారు. ఇవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని చంపేస్తూ ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఇదంతా సీఎం జగన్‌ ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనమన్నారు. వైకాపా రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని లోకేశ్ హెచ్చరించారు.

లోకేశ్ ట్వీట్

ఇదీచదవండి:దేవినేని ఉమకు రాత్రి నుంచి పదిసార్లు ఫోన్ చేశా: కొడాలి నాని

ABOUT THE AUTHOR

...view details