LOKESH ON TIRUMALA: తిరుమల పవిత్రతను పక్కా ప్రణాళికతో వైకాపా ప్రభుత్వం దెబ్బతీస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా జగన్ రెడ్డి మార్చేశారని విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుని అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు స్థానిక వైకాపా ఎమ్మెల్యే అనుచరుడు.. తనకు గది కేటాయించలేదంటూ.. తితిదే ఉద్యోగి వెంకటరత్నంపై దాడి చేశాడని మండిపడ్డారు. భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించలేకపోవడం తితిదే, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. తితిదే ఉద్యోగిపై దాడిచేసిన ఎమ్మెల్యే అనుచరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారవృతం కాకుండా చూడాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
LOKESH ON TIRUMALA: వివాదాల కేంద్రంగా..వెంకన్న సన్నిధి : లోకేశ్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
LOKESH ON TIRUMALA: వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా జగన్ రెడ్డి మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తిరుమల పవిత్రతను పక్కా ప్రణాళికతో.. వైకాపా ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు.
LOKESH ON TIRUMALA