ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ?: లోకేశ్ - జగన్​పై లోకేశ్ కామెంట్స్

ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగల్చటంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును వైకాపా ప్రభుత్వం అంధకారం చేసిందని నారా లోకేశ్ మండిపడ్డారు. "జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ?..బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య, విదేశీ విద్యకు అర్హులు కారా ?" అని ట్వీటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

lokesh comments over  foreign education for poor people
సీఎం జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ?

By

Published : Jan 11, 2021, 4:40 PM IST

జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య, విదేశీ విద్యకు అర్హులు కారా ? అని ప్రశ్నించారు. తన కూతురు విదేశీ విద్య కోసం ముక్బల్ జాన్ అనే మైనార్టీ మహిళ హిందూపురం నుంచి అమరావతి వరకూ చేపట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారని ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. ఆమెకు ప్రభుత్వం సహాయం చేయకపోగా...పోలీసులచే అడ్డుకుంటారా ? అని ఆక్షేపించారు.

ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చటంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశారని దుయ్యబట్టారు. ఒక మైనార్టీ మహిళ తన కుమార్తెను విదేశాల్లో చదివించాలని కల కనటం తప్పా అని ధ్వజమెత్తారు. ఆమె ఆవేదన వింటే జగన్ రెడ్డిది ఎంత చెత్త పరిపాలనో కళ్ళకు కట్టినట్లు అర్ధమవుతుందని ఎద్దేవా చేస్తూ..ట్వీటర్​లో బాధితురాలి వీడియోను జత చేశారు.

ఇదీచదవండి:జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ

ABOUT THE AUTHOR

...view details