ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh: నన్ను చూసి వాళ్లు భయపడుతున్నట్లుంది: లోకేశ్ - లోకేశ్ న్యూస్

తనను చూసి అధికార పార్టీ సభ్యులు భయపడుతున్నట్లు అనిపిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావించకుండా.. తనను తిట్టే పనిలో అధికార పార్టీ సభ్యులు నిమగ్నమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.

నన్ను చూసి వాళ్లు భయపడుతున్నట్లుంది
నన్ను చూసి వాళ్లు భయపడుతున్నట్లుంది

By

Published : Mar 23, 2022, 4:00 PM IST

శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావించకుండా.. అదేపనిగా తనను తిట్టే పనిలో అధికార పార్టీ సభ్యులు నిమగ్నమయ్యారని తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. వాళ్లు తనను చూసి భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. తన తల్లిని దూషిస్తే.. ముఖ్యమంత్రి, సభాపతి వికటాట్టహాసం చేస్తున్నారని, ఇది సరైంది కాదని దుయ్యబట్టారు. సభలో లేని వారి గురించి ప్రస్తావిచటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తానేది మర్చిపోలేదని.. అన్నీ గుర్తు పెట్టుకొని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు.

కల్తీ సారా మరణాలపై న్యాయ పోరాటం:కల్తీ సారా మరణాలు, మధ్య నిషేధంపై సభలో చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్ సభకు రాకుండా మంత్రి ద్వారా స్టేట్​మెంట్ ఇప్పిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. నాటుసారా మరణాలపై చర్చించకుండా పెగాసస్​పై చర్చిస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీసారా మరణాలపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్​పై.. పరువు నష్టం దావా వేస్తా: ఏబీవీ

ABOUT THE AUTHOR

...view details