ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇవ్వాల్సిన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లను వైకాపా నాయకులు కొట్టేయడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ పబ్లిసిటీకి, క్షేత్ర స్థాయిలోని కరోనా నివారణ చర్యలకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందని ఆయన మండిపడ్డారు. మాస్క్‌ల దుర్వినియోగం ఓ వైద్యుడు చేసిన ఆందోళన పోస్టును ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
'మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లను వైకాపా దోచేయడం దారుణం' - lokesh comments on ycp
కరోనా నేపథ్యంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతుంటే.... వారికి ఇవ్వాల్సిన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లను వైకాపా నాయకులు కొట్టేయడం దారుణమని నారా లోకేశ్ ట్విట్టర్లో మండిపడ్డారు.
లోకేశ్
Last Updated : Jun 4, 2020, 3:11 PM IST