ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుప్పం సీఐపై వైకాపా నేత చేయిచేసుకుంటే.. పోలీసుల సంఘం ఏం చేస్తోంది: లోకేశ్‌ - lokesh comments on ycp leader attack

కుప్పం సీఐపై వైకాపా నేత చేయిచేసుకుంటే పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలీస్ కాప‌లాలో రాష్ట్రంలో సాగుతోన్న గుండాయిజానికి పోలీసులూ బ‌లైపోవ‌డం విచార‌క‌రమన్నారు.

లోకేశ్‌
లోకేశ్‌

By

Published : Oct 23, 2021, 10:23 AM IST

కుప్పం అర్బన్ సీఐ సాదిక్ అలీపై శాంతిపురం మండల వైకాపా నేత చేయి చేసుకుంటే.. పోలీసు అధికారుల సంఘం క‌నీసం ఖండించ‌లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పోలీసు అధికారుల సంఘం నాయకులు శ్రీనివాసరావు.. తెలుగుదేశం నేత‌ల‌పైనే మీసం తిప్పుతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేత‌లైతే ఆయ‌న మీసం తిర‌గ‌దా? అని లోకేశ్ నిలదీశారు. సీఐపై దాడి విషయమై పోలీసు అధికారుల సంఘం స్పందిస్తుందేమో చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details