ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ..'నేను 420కి సవాల్ విసిరితే 840 ఎందుకు స్పందిస్తున్నారు' అని ఎద్దేవా చేశారు.
"నా సవాల్‌పై స్పందించేందుకు ఏ1కు దమ్ము, ధైర్యం లేదా? దేవుడిపై ప్రమాణం అంటే తోకముడిచారు, చర్చ అంటున్నారు. నాపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. నాపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని.. అప్పన్నపై ప్రమాణానికి తాను సిద్ధం... మరి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమా?" అని లోకేశ్ సవాల్ విసిరారు.