ముఖ్యమంత్రి జగన్ ఐటీ సమీక్షకు హాజరైన సలహాదారులన్ని సంస్థలైనా...రాష్ట్రానికి రాలేదని తెలుగుదేశం నేత నారా లోకేశ్ దుయ్యబట్టారు. డజన్ల కొద్దీ సలహాదారులను నియమించుకుంటున్నారే తప్ప...రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే ఒక్క సంస్థ కూడా తీసుకురావడం లేదన్నారు. తెలుగుదేశం హయాంలో వచ్చిన సంస్థలన్నీ ఐటీశాఖ మంత్రి తన ఖాతాలో వేసుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కొత్త సంస్థలు రాకపోగా..ఉన్నవి వీడిపోయే పరిస్థితులు తెచ్చారని మండిపడ్డారు. టీ, కాఫీలు తాగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆక్షేపించారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా.. సీఎం జగన్ ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపని ట్వీటర్ వేదికగా లోకేశ్ ఎద్దేవా చేశారు.