కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న మొనగాడు.. కేసుల మాఫీ కోసం నడుం వంచి నమస్కారాలు చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇచ్చిన ప్రతీ హామీకి కింద షరతులు వర్తిస్తాయని రాశాం చూసుకోలేదా అని వైకాపా నాయకులు ప్రజల్ని ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. జే టర్న్ జగన్ బ్రాండ్ నయా మోసమని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వైఎస్ జగన్ అని.... కానీ ఇప్పుడు పేలని గన్ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, 45 ఏళ్లకే పెన్షన్, సన్న బియ్యం, రాజధాని అమరావతి, రైతు భరోసా, అమ్మ ఒడి, మద్యపాన నిషేధం, 3 వేల రూపాయల పెన్షన్ ఇలా అనేక హామీలపై జగన్ జే టర్న్ తీసుకున్నారని దుయ్యబట్టారు.
జే టర్న్ జగన్ బ్రాండ్.. నయా మోసం: లోకేశ్ - సీఎం జగన్ పై నారా లోకేశ్ విమర్శలు
సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పేలని గన్ జగన్ అని ఎద్దేవా చేశారు.
నారా లోకేశ్