మహిళలపై అరాచకాలకు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. గుంటూరులో మూర్ఖుడి దాడికి రమ్య బలైందని.. రాజుపాలెంలో కామాంధుడి చేతిలో చిన్నారి బలైందని మండిపడ్డారు. ఇవాళ విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోల్ పోశారని చెప్పిన ఆయన.. వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనంలేదని విమర్శించారు.
LOKESH: మహిళలపై అరాచకాలకు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారింది: లోకేశ్
మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్న ఆయన.. దిశ చట్టం, దిశ యాప్ పేరుతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
lokesh comments on women attacks
వైకాపా పాలనలో ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయిందన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఇన్ని దాడులు జరుగుతున్నా.. దిశ చట్టం, దిశ యాప్ గురించి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహిళల ఉసురు తగిలితే రాష్ట్రానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:GORANTLA: బుచ్చయ్య చౌదరిని బుజ్జగించే పనిలో తెదేపా అధిష్ఠానం