Lokesh on jangareddygudem deaths: నాటుసారా మరణాలపై లోకేశ్ ఆధ్వర్యంలో.. తెదేపా నేతలు రెండో రోజు నిరసన చేపట్టారు. నకిలీ బ్రాండ్ల భాగోతం వెలికి తీయాలంటూ మండిపడ్డారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు.
నాటుసారా మరణాలు సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మంది చనిపోతే ప్రభుత్వంలో కనీస చలనం లేదని.. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు.