'ఇసుక ధరలు పెంచి బ్లాక్లో అమ్ముకుంటున్నారు' - tweet
రాష్ట్ర ప్రభుత్వంపై నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. ఇసుక అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ట్వీట్ చేశారు.
నారా లోకేశ్
పదిహేను వందల ఉన్న ఇసుక ధరని 8వేల రూపాయల నుంచి 15వేల వరకు పెంచి బ్లాక్ లో అమ్ముకుంటున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్లో పేర్కొన్నారు. వైకాపా నేతలు.. కూలి ప్రజల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. చెయ్యడానికి పనులు లేక కూలీలు పస్తులుంటుంటే వైకాపా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లూ లేదా అని నిలదీశారు. రాజన్న రాజ్యం అంటే ఇదేనా అని ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను తన ట్విటర్ ఖాతాలో పెట్టారు