ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ కేంద్రంగా 'లోకాయుక్త' కార్యకలాపాలు - govt

ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న లోకాయక్త, ఉపలోకాయక్తలను విజయవాడకు తరలించునున్నారు. ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయ భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయ భవనంలో లోకాయుక్త

By

Published : Sep 5, 2019, 4:24 AM IST

లోకాయుక్తను విజయవాడ ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయ భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ప్రస్తుతం హైదరాబాద్ బషీర్బాగ్ లో కొనసాగుతున్న లోకాయుక్త ,ఉప లోకాయుక్తలను విజయవాడకు తరలించనున్నారు . మహాత్మ గాంధీ రోడ్ లోని రోడ్డు భవనాల శాఖ ప్రధాన కార్యాలయ మొదటి అంతస్తులో లోకాయుక్త కార్యాలయంకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . ప్రస్తుతం లోకాయుక్తలో ఫిర్యాదు చేయాలంటే బాధితులు హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోంది . ఇప్పుడు విజయవాడకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయ భవనంలో లోకాయుక్త

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details