ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2020, 1:04 PM IST

ETV Bharat / city

లాక్​డౌన్ సడలింపులు..రోడ్లపై పెరిగిన జన సంచారం

విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో ప్రజలు కోవిడ్-19 నిబంధనలను పాటించటం లేదు. లాక్​డౌన్ సడలింపులు ఇవ్వటంతో యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. వారిని నిలువరించటం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో నిబంధలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వాహనదారులకు జరిమానాలు విధించటంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

లాక్​డౌన్ సడలింపుతో కొత్త సమస్య...రోడ్లపై పెరిగిన జన సంచారం !
లాక్​డౌన్ సడలింపుతో కొత్త సమస్య...రోడ్లపై పెరిగిన జన సంచారం !

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ నుంచి సడలింపులు ఇవ్వటంతో విజయవాడలో ప్రజలు కరోనా నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. వివిధ రకాల పనుల నిమిత్తం నగరంలోకి వచ్చే వాహనదారులతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి. మాస్కులు లేకుండా..ట్రాఫిక్ నిబంధలు పాటించకుండా ద్విచక్రవాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్న ప్రజలను నిలువరించటం ట్రాఫిక్ పోలీసులకు సమస్యగా మారింది.

విజయవాడ, సింగ్​నగర్, బుడమేరు వంతెన సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులకు అవగాహన కల్పించారు. సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details