విజయవాడలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 35కేసులు నమోదుకాగా..అందులో 27కేసులు నగరంలోనే ఉండటంతో అధికారులు మరింత జాగ్రత్త వహిస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. నిత్యావసరాల కోసం 3గంటలు మాత్రమే అనుమతిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల తర్వాత వాహనాలు రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్... బయటకొస్తే కఠిన చర్యలే - విజయవాడలో లాక్డౌన్
విజయవాడలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున అధికారులు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. రెడ్ జోన్లలో మరింత గస్తీ పెంచారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
విజయవాడలో లాక్డౌన్