లాక్డౌన్ 2.0 నిబంధనలు...
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు
- ఫార్మా, ఆస్పత్రులు, మెడికల్ షాపులకు మినహాయింపు
- పెట్రోల్ పంపులు, శీతల గిడ్డంగులు, మీడియాకు మినహాయింపు
- బ్యాంకులు, ఏటీఎంల నిర్వహణకు మినహాయింపు
- 33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు నడవాలని నిర్ణయం
- ముందస్తు అనుమతితో పెళ్లిళ్లకు గరిష్ఠంగా 40 మందికి మాత్రమే అనుమతి
- అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
- రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
- ఉ.6 - 10 వరకు అన్ని రకాల మెట్రో, ప్రజా రవాణా, ఆర్టీసీకి అనుమతి
- ఉ.6 – 10 వరకు రేషన్ దుకాణాలకు అనుమతి
- యథావిధిగా వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా
- సినిమా హాళ్లు, క్లబ్బులు, స్విమ్మింగ్‌పూల్స్, వినోద పార్క్‌లు, క్రీడా మైదానాలు మూసివేత
- నిబంధనలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు
కేబినెట్ సమావేశంలో తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలు..
- మే 20న కేబినెట్ మరోసారి సమావేశం అవుతుంది. లాక్డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి తదుపరి నిర్ణయం
- యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు
- ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తీసుకురావడం. వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు
- అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం
- రోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం