ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక పోరు: అభ్యర్థుల ఎంపికపై వైకాపా కీలక నిర్ణయం - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కీలక నిర్ణయం

స్థానిక పోరులో పోటీ చేయాలని ఆశపడ్డ వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యుల బంధువులకు భంగపాటే ఎదురైంది. వారికి సీట్లు కేటాయించవద్దని పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలకు సందేశాలు పంపింది.

అభ్యర్థుల ఎంపికపై వైకాపా కీలక నిర్ణయం
అభ్యర్థుల ఎంపికపై వైకాపా కీలక నిర్ణయం

By

Published : Mar 11, 2020, 4:47 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వైకాపా కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు వారి బంధువులను స్థానిక సమరంలో పోటీకి దించకూడదని నిర్ణయం తీసుకుంది. పార్టీ విధి, విధానాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలకు సందేశాలు పంపింది. పార్టీ నిర్ణయాన్ని కాదని ఎవరైనా పోటీకి దిగితే..బి-ఫారం ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. తమవారికి సీట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు,నియోజకవర్గ బాధ్యులు అధిష్టానంపై ఒత్తిళ్లు తెస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details