రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికల సంఘం శుక్రవారం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదించటంతో జిల్లా పరిషత్ స్థానాల్లో బీసీలకు ఒక పదవి తగ్గింది. తొలుత ఈనెల 3న ప్రకటించిన రిజర్వేషన్లలో బీసీలకు 4 కేటాయించగా.. ఈసారి మూడే దక్కాయి. మొత్తం 13 జడ్పీల్లో జనరల్ కేటగిరీలో 7ఉండగా... బీసీలకు 3, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి కేటాయించారు.
జిల్లాల వారీగా రిజర్వేషన్లు
జిల్లా | రిజర్వేషన్ |
అనంతపురం | బీసీ మహిళ |
చిత్తూరు | జనరల్ |
తూర్పుగోదావరి | ఎస్సీ |
గుంటూరు | ఎస్సీ మహిళ |
కృష్ణా | జనరల్ మహిళ |
కర్నూలు | జనరల్ |
ప్రకాశం | జనరల్ మహిళ |
నెల్లూరు | జనరల్ మహిళ |
శ్రీకాకుళం | బీసీ మహిళ |
విశాఖపట్నం | ఎస్టీ మహిళ |
విజయనగరం | జనరల్ |
పశ్చిమగోదావరి | బీసీ జనరల్ |
కడప | జనరల్ |
రాష్ట్రంలోని 660 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జడ్పీటీసీల్లో ఎస్టీ మహిళకు 32, ఎస్టీ జనరల్‌కు 25, ఎస్సీ మహిళకు 60, ఎస్సీ జనరల్‌కు 61, బీసీ మహిళకు 78, బీసీ జనరల్‌కు 76 కేటాయించారు. జనరల్ మహిళకు 159, జనరల్‌కు 163 స్థానాలు ఖరారు చేశారు. ఇక ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ మహిళకు 31, ఎస్టీ జనరల్‌కు 26, ఎస్సీ మహిళకు 66, ఎస్సీ జనరల్ 61, బీసీ మహిళ 78, బీసీ జనరల్ 76 స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళకు 159, జనరల్‌కు 163 స్థానాలు ఖరారు చేశారు. మొత్తంగా 333 జడ్పీటీసీ, 333 ఎంపీపీ స్థానాల్లో మహిళలే ఉండనున్నారు. జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసే అవకాశం ఉండటం వల్ల ఈ సంఖ్య మరింత పెరగనుంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ల పదవులూ సగానికిపైగా మహిళలనే వరించనున్నాయి