security bonds auction: రిజర్వు బ్యాంకులో (Reserve Bank) సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్రప్రభుత్వం ఇవాళ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. రాష్ట్ర అభివృద్ధి రుణాల పేరిట ఈ వారం కూడా ప్రభుత్వం రుణాన్ని తీసుకుంది. రిజర్వు బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలం (security bonds auction) ద్వారా రూ.వెయ్యి కోట్ల చొప్పున రెండు లాట్లలో ఈ రుణాన్ని పొందింది. 7.72 శాతం వడ్డీతో 12 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్ల విలువైన సెక్యూరిటీ బాండ్లు.. అలాగే 20 ఏళ్ల కాలపరిమితితో 7.82 శాతం వడ్డీతో మరో రూ.వెయ్యి కోట్ల మేర సెక్యూరిటీ బాండ్ల వేలం వేశారు.
సెక్యూరిటీ బాండ్ల వేలం.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్లు అప్పు - security bonds auction in ap
security bonds: రాష్ట్రప్రభుత్వం ఇవాళ మరో రూ.2 వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ రుణాన్ని పొందింది.
సెక్యూరిటీ బాండ్ల వేలం
2022 ఏప్రిల్ 1 తేదీ నుంచి ఇప్పటి వరకూ రూ.28 వేల కోట్ల మేర సెక్యూరిటీ బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) రుణాన్ని తీసుకుంది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం మరో రూ.20 వేల కోట్ల వరకూ మాత్రమే బాండ్ల వేలానికి అవకాశం ఉంది.
ఇవీ చూడండి