ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రివర్గంలో సామాజిక సమతుల్యం : సజ్జల - ఏపీ మంత్రి వర్గం

సామాజిక సమతుల్యతతో మంత్రివర్గం
సామాజిక సమతుల్యతతో మంత్రివర్గం

By

Published : Apr 10, 2022, 2:50 PM IST

Updated : Apr 10, 2022, 3:18 PM IST

14:44 April 10

మంత్రివర్గ కూర్పుపై సీఎం కసరత్తు పూర్తి

సామాజిక సమతుల్యతతో మంత్రివర్గం

మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు పూర్తయింది. గత మూడు రోజులుగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చించిన సీఎం.. ఈరోజు కూడా సమావేశమయ్యారు. సీఎం జగన్​తో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌ కూర్పుపై సీఎం కసరత్తు ముగిసినట్లు చెప్పారు. సామాజిక సమతుల్యత ఉండేలా నూతన మంత్రివర్గ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రివర్గం ఉంటుందన్నారు.

"మంత్రివర్గ కూర్పుపై సీఎం కసరత్తు పూర్తయ్యింది. సామాజిక, ప్రాంతాల సమీకరణాల మేరకు మంత్రివర్గ కూర్పు. సామాజిక సమతుల్యత ఉండేలా మంత్రివర్గం ఉంటుంది. సాయంత్రం 6 గం.కు సీల్డ్‌ కవర్‌ను గవర్నర్‌కు పంపుతారు. సీఎం స్వయంగా ఫోన్ చేసి ఎమ్మెల్యేలకు వివరాలు చెబుతారు."- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

ఇదీ చదవండి: మంత్రివర్గంపై తుది దశకు చేరుకున్న కసరత్తు.. కాసేపట్లో గవర్నర్​కు జాబితా

Last Updated : Apr 10, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details