అంతర్వేది ఘటనకు వ్యతిరేకంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర నిరసన తెలపడానికి వచ్చిన తెదేపా నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేశారని లింగమనేని శివరామ ప్రసాద్ అన్నారు. గత 15 నెలలుగా దేవాలయాలపై 150 దాడులు జరిగాయని తెదేపా నాయకులు లింగమనేని శివరామ ప్రసాద్ అన్నారు. అమ్మవారి ఆలయం వద్ద పూజలు చేసి నిరసనకు బయల్దేరుతున్న తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందని ఆ హక్కును కాలరాసేలా పోలీసుల చర్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెదేపా నాయకుల అరెస్టు దారుణం' - అంతర్వేది ఘటనపై వార్తలు
అంతర్వేది ఘటనకు వ్యతిరేకంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర నిరసన తెలపడానికి వచ్చిన తెదేపా నాయకుల అరెస్టు దారుణమని లింగమనేని శివరామ ప్రసాద్ అన్నారు.ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు.
తెదేపా నాయకులు