విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ లీగల్ సెల్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ రాజీనామా చేశారు. వైకాపా ఓటమికి కృషి చేసిన వారికి పదవులిచ్చి అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్లాది విష్ణు ఓటమికి పని చేసిన వ్యక్తులకు పదవులను కట్టబెట్టారన్నారు.
అందుకు నిరసనగానే.. తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే విష్ణును నమ్ముకుని ఆయన గెలుపునకు తాను వీలైనంతగా కృషి చేస్తే.. ఇవాళ తనను పక్కన పెట్టారని గవాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువజన, రాష్ట్ర లీగల్ సెల్ నాయకుడిగా పార్టీ కోసం ఎంతో కృషి చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.