ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొత్త జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తాం' - cpm madhu news

అన్నీ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో కొత్త జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయాలని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. విజయవాడలో ఎనిమిది వామపక్ష పార్టీల నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మాట్లాడారు.

Leftist parties leaders
Leftist parties leaders

By

Published : Jun 29, 2021, 5:23 PM IST

జాబ్​ క్యాలెండర్​పై మాట్లాడుతున్న వామపక్ష నేతలు

ఎన్నికల్లో జగన్​ ఇచ్చిన హామీ మేరకు జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయాలని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. విజయవాడలో ఎనిమిది వామపక్ష పార్టీల నేతలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్​ క్యాలెండర్​తో నిరుద్యోగులు నిరాశ చెందారన్నారు. సాధారణ డిగ్రీ చదివిన వారికి అసలు పోస్టులే లేవన్నారు. దీనిపై పునఃపరిశీలన చేసి.. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు కోరారు. రేపు జరగబోయే కేబినేట్​ సమావేశంలో వీటిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కేంద్రం ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు లేక, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చక నిరుద్యోగుల పరిస్థితి అయోమయంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకు దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని ప్రాథమిక విద్యలో రకరకాల మార్పులు చేసి, విద్యారంగాన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో పాఠశాలలు మూతపడి ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. -సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా.. రాష్ట్రంలోనూ నిరుద్యోగులు ఎక్కువయ్యారు. జాబ్​ రావాలంటే బాబు పోవాలని ఎన్నికల్లో ప్రచారం చేసుకుని... ఇప్పుడు జగన్​ చేసిందేంటి..?వాలంటీర్​ పోస్టులను ఉద్యోగాలుగా చెబుతున్నారు. అవి ఉద్యోగాలా..? కనీస వేతనం ఇచ్చి, వారిని శాశ్వత ఉద్యోగులను చేసి, వాటిని ఉద్యోగాలుగా చెప్పుకోవాలి. అధికారంలోకి రాక ముందు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న వాళ్లని తీసేస్తున్నారు. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఇదీ చదవండి:AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details