ఆర్థిక మాంద్యం ప్రభావం, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... పేద మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలు తీవ్ర ప్రభావం చూపించాయని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
11న రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల నిరసన - 11న రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల నిరసన న్యూస్
ఆర్టీసీ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, ఉల్లిపాయల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ... ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి.

left parties protest againist govt