ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర విధానాలపై..ఈ నెల 16న దేశవ్యాప్తంగా వామపక్షాల రాస్తారోకోలు

కార్పొరేట్లకు వరాలు - సామాన్యులపై భారాలు అనే అంశంపై విజయవాడలో వామపక్షాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. భాజపా విధానాలతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని...ఇసుక కొరత సమస్యను ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించకపోవటంతో లక్షల కార్మికులు ఉపాధి కోల్పోయారని వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

ఈ నెల 16న కేంద్ర విధానాలపై దేశవ్యాప్తంగా రాస్తా రోకో: వామపక్షాలు

By

Published : Oct 13, 2019, 8:44 PM IST

ఈ నెల 16న కేంద్ర విధానాలపై దేశవ్యాప్తంగా రాస్తా రోకో: వామపక్షాలు

'కార్పొరేట్లకు వరాలు - సామాన్యులపై భారాలు' అనే అంశంపై విజయవాడలో వామపక్షాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కేంద్రంలో భాజపా విధానాలతో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని.. రైతులకు 6 వేల రూపాయలు ఖాతాల్లో వేస్తే సరిపోతుందని మోదీ ప్రభుత్వం అనుకుందని ఆక్షేపించారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా ఇసుక కొరత సమస్య పరిష్కరించకపోవడంతో లక్షల కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై 16వ తేదీన దేశవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 10 శాతం నిరుద్యోగం నమోదైందని..బ్యాంకులలో సొమ్ము కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి రాయితీలు ప్రకటించారని మధు విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

left parties

ABOUT THE AUTHOR

...view details