ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు.. నిర్ణయం వెనక్కి తీసుకోవాలి' - రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సివినాగార్జున రెడ్డి వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లను అమర్చే విధానాన్ని వామపక్షాలు తప్పు పట్టాయి. కేంద్ర విద్యుత్తు సవరణ విధానాలను ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని సీపీడీసీఎల్‌ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.

left parties
'వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

By

Published : Jan 19, 2021, 4:08 PM IST

Updated : Jan 19, 2021, 7:20 PM IST

2021 - 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల ఆదాయం, అవసరమైన విద్యుత్తు ఇతర అంశాలకు సంబంధించి పలు జిల్లాలోని సీపీడీసీఎల్‌ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

కృష్ణా జిల్లా:

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని... విద్యుత్తు రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉన్నాయని విజయవాడలోవామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చి, ఆ చార్జీలను రైతుల నుంచి వసూలు చేయడం ద్వారా ఉచిత విద్యుత్తుకు మంగళం పాడబోతున్నారని... ఈ నిర్ణయం అమలు చేసిన తర్వాత గృహ వినియోగదారులపైనా ఆ ప్రయోగం చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు విమర్శించారు. కేంద్ర విద్యుత్తు సవరణ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు.

డిస్కంలు రూ.31వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని... విద్యుత్‌ శాఖకు ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు మరో రూ.30వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని... వాటి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఇతర సంఘాలు సూచించాయి. రాష్ట్రంలో చేపల చెరువుల వద్ద విద్యుత్‌ చౌర్యం ఎక్కువగా జరుగుతోందని... విద్యుత్‌ శాఖలోని విజిలెన్స్‌ అధికారులు అక్కడకు వెళ్లడానికి భయపడుతున్నారని ఆరోపించాయి. రూ.లక్ష చెల్లించాల్సిన చెరువుల యజమానులు వేలల్లో బిల్లులు చెల్లిస్తున్నారని.. దీన్ని అరికట్టడానికి విజిలెన్స్‌ విభాగానికి ప్రత్యేకంగా ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించాయి.

విశాఖపట్నం జిల్లా:

రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సివినాగార్జున రెడ్డి​తో పాటు, సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్ అధ్వర్యంలో విశాఖ సీపీడీసీఎల్‌ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. వినియోగదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రం, తలారిచెరువు సోలార్ ప్లాంట్ ,రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్-నాలుగు విద్యుత్ రేట్లను నిర్దారించామ‌ని జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. రైతుల నుంచి వసూలు చేసిన ట్రాన్స్​ఫార్మర్ ఖర్చులను కమిషన్ ఆదేశాల మేరకు డిస్కంలు రైతులకు తిరిగి ఇచ్చాయ‌న్నారు. విద్యుత్ చార్జీలపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కమిషన్ ఆదేశాల ప్రకారం డిస్కంలు తెలుగు భాషలో చిన్న పుస్తకాలు ప్రచురించి అందుబాటులోకి తీసుకొచ్చాయన్నారు.

విశాఖ సీపీడీసీఎల్‌ సమావేశ మందిరం

ఇదీ చదవండి:కాంగ్రెస్​ రాజ్​భవన్​ ముట్టడి...అడ్డుకున్న పోలీసులు..శైలజానాథ్​కు గాయాలు

Last Updated : Jan 19, 2021, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details