సీనియర్ జర్నలిస్ట్ మబ్బు గోపాల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తిరుమల బ్రహ్మోత్సవాల కవరేజ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. కనుమ రోడ్డులో ప్రమాదం జరిగి గోపాల్‌రెడ్డి మృతి చెందారు. గోపాల్‌రెడ్డి మృతిపై ప్రముఖులు, నేతలు, జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చంద్రబాబు: సీనియర్ జర్నలిస్ట్ మబ్బు గోపాల్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల కవరేజ్‌కు వెళ్లిన గోపాల్ రెడ్డి కనుమ రోడ్డులో జరిగిన ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నించే కలం యోధుడు గోపాల్ రెడ్డి మరణం.. తిరుపతి జర్నలిస్ట్ వర్గానికి తీరని లోటుగా పేర్కొన్నారు. గోపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.