ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Errannaidu vardhanti: 'ఆత్మీయతే ఆయుధంగా అందరి మనసులు గెలుచుకున్నారు' - ap latest news

మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు(Kinjarapu Errannaidu) 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నేతలు నిర్వహించారు. ఆత్మీయతే ఆయుధంగా ఎర్రన్నాయుడు రాజకీయాల్లో అందరి మనసులు గెలుచుకున్నారని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులువురు నాయకులు ఎర్రన్నాయకుడికి నివాళులర్పించారు.

Errannaidu
Errannaidu

By

Published : Nov 2, 2021, 3:57 PM IST

ఆత్మీయతే ఆయుధంగా ఎర్రన్నాయుడు(Errannaidu) రాజకీయాల్లో అందరి మనసులు గెలుచుకున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) కొనియాడారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ఎర్రన్నాయుడు 9వ వర్ధంతి సంద్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనగాని సత్యప్రసాద్, ఆలపాటి రాజా, అశోక్ బాబు, మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్రయాదవ్, కూన రవికుమార్, బీసీ జనార్థన్ రెడ్డి, ఎంఎస్ రాజు, డూండీరాకేశ్, నరసింహ ప్రసాద్, గురుమూర్తి, దారపనేని నరేంద్ర, కుమారస్వామి తదితరులు పూలు చల్లి నివాళులర్పించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి, కేంద్రమంత్రిగా ప్రజలకు ఎర్రన్నాయుడు చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. దిల్లీలోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నానిలు ఎర్రన్నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు.

ఇదీ చదవండి :Kodali nani: 'పవన్​కు ధైర్యముంటే..ప్రధాని మోదీకి డెడ్​లైన్​ పెట్టాలి'

ABOUT THE AUTHOR

...view details