విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండించారు. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగ పరిధిలో ప్రజలకు అనుగుణంగా నడవాల్సిన అవసరం ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ అన్నారు.ఏ విధమైన నోటీసు లేకుండా అర్ధరాత్రి న్యాయవాదిని అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
'న్యాయవాదులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం' - విజయవాడ వార్తలు
రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసుల దాడులను నిరసిస్తూ విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.
ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బెజవాడ బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుందన్నారు. ఇప్పటికే కోర్టులు పలుమార్లు పోలీస్లను చట్ట పరిధి దాటి ప్రవర్తించోద్దని మందలిస్తున్న ఇలాంటి చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. పోలీసులకు ప్రత్యేక అధికారాలు లేవని.. చట్ట పరిధికి లోబడి ప్రవర్తించాలని లేకుంటే న్యాయవాదులుగా పోలీస్లపై కేసు వేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.
ఇదీ చదవండి'రాష్ట్రంలో బలహీనవర్గాలపై దాడులు పెరిగాయి..'