బహుజనులు, వెనకబడిన వర్గాల మీద వైకాపా ప్రభుత్వం దాడులు చేస్తుందని.. న్యాయవాది శ్రవణ్ కుమార్ అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీలపై, వ్యవస్థలపై వైకాపా ప్రభుత్వం దాడి చేసిందన్నారు. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేశామా అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బాధపడుతున్నారన్నారు. ఓటు హక్కును ఉపయోగించుకుని తిరుపతి ఉపఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 12వ తేదీన ఉద్యోగ, యువజన, బహుజన సంఘాలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. 'మా ఓటు - మా సీటు' అనే నినాదంతో దళితులకు రాజ్యాధికారం రావాలని తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థిని నిలబెడతామని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.
'వెనకబడిన వర్గాల మీద వందేళ్లకు సరిపడా దాడులు చేశారు' - తిరుపతి ఉపఎన్నికలపై న్యాయవాది శ్రవణ్ కుమార్ కామెంట్స్
వైకాపా అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో బహుజనులు, వెనకబడిన వర్గాల మీద 100 ఏళ్లకు సరిపడా దాడులు చేసిందని న్యాయవాది శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా వైకాపా చేస్తుందని దుయ్యబట్టారు.

'వెనకబడిన వర్గాల మీద 100 ఏళ్లకు సరిపడా దాడులు చేశారు'