ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్యాక్​లాగ్ పోస్టులు భర్తీ చేయాలి: జై భీమ్ యాక్సిస్ వ్యవస్థాపకుడు శ్రవణ్ - బ్యాక్ లాగ్ పోస్టులపై శ్రవణ్ కుమార్ కామెంట్స్

బ్యాక్​లాగ్ పోస్టులు భర్తీ చేయాలంటూ జై భీమ్ యాక్సిస్ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్ విజయవాడ ధర్నా చౌక్​లో ఆకాంక్ష దీక్ష చేపట్టారు. సంఘీభావంగా దళిత సంఘాల నేతలు హాజరయ్యారు.

lawyer sravan kumar protest on backlog posts
lawyer sravan kumar protest on backlog posts

By

Published : Jul 3, 2021, 4:01 PM IST

బ్యాక్​లాగ్ పోస్టులు భర్తీ చేయాలని జై భీమ్ యాక్సిస్ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్ విజయవాడలో ఆకాంక్ష దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. అవినీతి, తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే అన్యాయంగా కేసులు పెడుతున్నారన్నారని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ మాట ఇచ్చారన్నారు.

ఇప్పుడు మాట తప్పి.. మడమ తిప్పారని విమర్శించారు. ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వాలంటీర్లు.. సేవకులు మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించ లేదా? అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని.. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శ్రవణ్ అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details