ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BADVEL BYPOLLS: 'ఓటు నోటాకు వేసి..వైకాపాకు బుద్ది చెప్పాలి' - vijayawada news

బద్వేలు ఉప ఎన్నికల్లో(BADVEL BYPOLLS) వైకాపాకు బుద్ధి చెప్పాలని లాయర్ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

BADVEL BYPOLES
BADVEL BYPOLES

By

Published : Oct 18, 2021, 4:28 PM IST

బద్వేలు ఉప ఎన్నికల్లో నోటాకు ఓటేసి (VOTE TO NOTA) నిరసన తెలపాలని ప్రజలకు జై భీం యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు, లాయర్ జడ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. బద్వేలు ఎమ్మెల్యే మరణించటంతో ఆ కుటుంబంలోని వ్యక్తినే వైకాపా ఎన్నికల్లో నిలిపారన్నారు. దీంతో సంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎన్నికల బరి నుంచి వైదొలిగినప్పటికీ.. భాజపా అభ్యర్థిని నిలిపిందని తెలిపారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. సంబంధిత కేసుల్లో నిందితులపై ఛార్జ్​షీట్ దాఖలు చేయలేదని ఆరోపించారు. దళితులకు సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా, సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించిన ఈ ప్రభుత్వానికి ఓటు వేద్దామా..? అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ నుంచి రమ్య ఉదంతం వరకు జరిగిన కేసుల్లో ఒక్కరిపై కూడా ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేలు ప్రజలంతా ఆలోచించి.. తమ ఓటు నోటాకు వేసి వైకాపాకు బుద్ది చెప్పాలని కోరారు. దళితుల మీద ఇన్ని దాడులు జరిగితే భాజపా ఎందుకు ప్రశ్నించటం లేదని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details