ముఖ్యమంత్రి 100 రోజుల పాలనపై భాజపా విజయవాడ శాశనసభ కన్వీనర్ కిలారు దిలీప్ ఘాటుగా స్పందించారు. భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేలా చేశారని విమర్శించారు. దేవాదాయశాఖకు చెందిన భూములను సేకరించి... ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమేనని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆర్టీసీ టిక్కెట్లపై జరిగిన అన్యమత ప్రచారం విషయంలో ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో 100కు పైగా గోవులు చనిపోతే దానిపై ఇప్పటికీ దర్యాప్తు జరిపించకపోవడం దారుణమన్నారు. వైకాపాపై నమ్మకంతో ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారని.... ఇప్పటికైనా జగన్ ప్రజాకర్షక పాలన చేస్తే బాగుంటుందని దిలీప్ హితవు పలికారు.
'భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు' - కన్వీనర్ కిలారు దిలీప్
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని... భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేలా చేశారని.. భాజపా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కిలారు దిలీప్ విమర్శించారు.

కిలారు దిలీప్