తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 90 వేల 966 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 578 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,36,627 కి చేరింది. మరో ముగ్గురు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3వేల 759గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 5 లక్షల 29వేల 888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 731 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,23,044 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేల 824 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.86 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 86,409 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో 4,557 మందికి పరీక్షలు చేయించుకున్నారు.
జిల్లాల వారీగా...