AP Corona cases : గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,844 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 166 మందికి వైరస్ సోకగా.. ఇద్దరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొవిడ్ నుంచి మరో 91 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,154 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 16వేల మందికి వైరస్
India covid cases: దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 16,764 కేసులు నమోదయ్యాయి. 220 మంది మరణించారు. గురువారం 66,65,290 మందికి టీకాలు అందించారు. 24 గంటల వ్యవధిలో 16,764 కేసులు వెలుగుచూశాయి. మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,585 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270కి చేరింది.