గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 55 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,869కి చేరిందని వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదని తెలిపిన వైద్యారోగ్యశాఖ.. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 7,161 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మరో 117 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8.8 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ కరోనా నిర్ధరణ పరీక్షలు 1 కోటీ 35 లక్షలు దాటినట్లు వెల్లడించారు.