corona cases : రాష్ట్రంలో కొత్తగా 4,250 కరోనా కేసులు, 33 మరణాలు - corona deaths in andhrapradhesh
16:17 June 27
ఏపీ లో తాజా కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 95,327 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 4,250 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ కారణంగా మరో 33 మంది మృతి చెందినట్లు తెలిపారు. కొవిడ్ నుంచి మరో 5,570మంది బాధితులు కోలుకోగా... రాష్ట్రంలో ప్రస్తుతం 44,773కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనాతో కృష్ణా జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 890, చిత్తూరు జిల్లాలో 673, పశ్చిమగోదావరి జిల్లాలో 417 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీచదవండి.