.
work crisis: కూలీ పనులు లేక అల్లాడిపోతున్న కార్మికులు.. రోడ్ల మీదే పడిగాపులు - labours struggle with work crisis
Labour on work crisis in Vijayawada: కార్మికుడికి కష్టం కాలం వచ్చింది. ఒకవైపు పెరిగిన ధరలు అయితే... మరోవైపు కూలీ పనులు లేక అల్లాడిపోతున్నాడు. వైకాపాకు ఓటేసి తమ జీవితాలను అంధకారంలోకి నెట్టేసుకున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో చవకగా ఇసుక దొరికేదని.. ఫలితంగా కార్మికులకు పుష్కలంగా పనులు ఉండేవి అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంతో ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచేశారని మండిపడ్డారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్, వన్‌టౌన్.. సహా పలు ప్రాంతాల్లో వేల మంది కార్మికులు రోజూవారి కూలీ పనులకు వెళ్లేవారు. ఇప్పుడు వంద మందికి కూడా పని దొరకడంలేదు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీల పెంపు.. ఇలా సామన్యుడి నడ్డివిరిగేలా అన్ని పెరిగిపోయాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు పనికోసం వచ్చిన కార్మికులకు.. కూలీకి తీసుకెళ్లేవారు లేక వెనుదిగురుతున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మికులతో మా ప్రతినిధి ముఖాముఖి..
labours struggle with work crisis
Last Updated : May 21, 2022, 5:05 PM IST