ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KUNA RAVIKUMAR: 'ఈ నెల 8న కమిటీ ముందు హాజరై వివరణ ఇస్తా' - తెదేపా నేత కూన రవికుమార్​కు సభాహక్కుల కమిటీ నోటీసులు

సభాపతి స్థానాన్ని, అసెంబ్లీ వ్యవహారాలను కించపరిచే విధంగా ఎన్నడూ మాట్లాడలేదని తెదేపా నేత కూన రవి కుమార్ అన్నారు. ఈ నెల 8న సభాహక్కుల కమిటీ ముందు హాజరై లిఖితపూర్వకంగా తన వివరణ ఇస్తానని కూన రవి తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం(Kuna Ravi Kumar on tammineni seetharam) ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదన్నారు.

kuna ravi kumar on hammineni Seetharam
తెదేపా నేత కూన రవికుమార్

By

Published : Oct 6, 2021, 4:39 PM IST

అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాక తాను వైకాపా ఎమ్మెల్యేను మాత్రమే అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Kuna Ravi Kumar on tammineni seetharam) అనేక సార్లు చెప్పారని తెదేపా నేత కూన రవికుమార్(tdp leader Kuna Ravi Kumar) అన్నారు. అందుకనుగుణంగా నాతోపాటు అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపైనా అనేక విమర్శలు చేశారని ఎన్టీఆర్ భవన్​లో మీడియా మీడియా సమావేశంలో కూన రవికుమార్​ మాట్లాడారు. సీతారాం(tammineni seetharam) ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదన్నారు.

'నేను ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం(speaker tammineni seetharam )ను మాత్రమే విమర్శించా తప్పా.. సభాపతి స్థానాన్ని, అసెంబ్లీ వ్యవహారాలను కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ నెల 8న సభాహక్కుల కమిటీ ముందు హాజరవ్వాలని నాకు నోటీసులు ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలపై నాకు గౌరవం ఉంది. ఈ నెల 8న కమిటీ ముందు హాజరై వ్యక్తిగతంగా, లిఖితపూర్వకంగానూ నా వివరణ ఇస్తా' -కూన రవి కుమార్, తెదేపా నేత

ABOUT THE AUTHOR

...view details