ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​తో కుమార మంగళం బిర్లా భేటీ

ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత కుమార మంగళం బిర్లా ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. బలభద్రపురంలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రారంభం అనంతరం.. సీఎం జగన్​తో పాటు తాడేపల్లి చేరుకున్న బిర్లాకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

సీఎం జగన్​తో కుమార మంగళం బిర్లా మర్యాదపూర్వక భేటీ
సీఎం జగన్​తో కుమార మంగళం బిర్లా మర్యాదపూర్వక భేటీ

By

Published : Apr 21, 2022, 6:55 PM IST

ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత కుమార మంగళం బిర్లా ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రారంభం అనంతరం.. సీఎం జగన్​తో పాటు కుమార మంగళం బిర్లా తాడేపల్లి చేరుకున్నారు. ఆయనకు తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన జగన్.. జ్ఞాపికతో సత్కరించారు.

బలభద్రపురంలో గ్రాసిమ్ పరిశ్రమ: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్ క్లోర్ ఆల్కలి రసాయన పరిశ్రమను.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి లభిస్తుందని జగన్‌ చెప్పారు. కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుందన్న ఆయన.. గ్రాసిమ్ సంస్థ అందించే సీఎస్​ఆర్ నిధులు స్థానికంగా ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయన్న కుమార మంగళం బిర్లా..సీఎం జగన్‌తో పాటు అధికారుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

"ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అనుకూల, ఆకర్షణీయ ప్రాంతంగా ఉంది. గ్రాసిమ్‌ పరిశ్రమకు ప్రస్తుతం రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టాం. రానున్న రోజుల్లో ఈ పెట్టుబడి వ్యయం రూ.2500 కోట్లకు పెంచుతాం. పరిశ్రమ ద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పించనున్నాం. వెయ్యి మందికి పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చాం. 2400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశ్రమ ద్వారా ఉపాధి అందిస్తాం. అంతేకాకుండా స్థానికంగా ఉన్నవారి నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తాం." -కుమార మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత

ఇదీ చదవండి: Grasim Industry: గ్రాసిమ్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉపాధి: జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details