ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శాస్త్రాలు మనుషులకేనా.. కోళ్లకూ ఉంది! - కోళ్ల పందేలు న్యూస్

కోడిపందాలు అంటే ఏవో రెండు పుంజులు ఫైటింగ్ చేసుకోవడం మాత్రమే కాదు. దాని వెనక పెద్ద చరిత్రే ఉంది. పందెం రోజు నక్షత్ర బలం? వారం? ఏ దిక్కుగా వెళ్లి పందానికి దిగాలి? అబ్బో ఇలా చాలా విషయాలే ఉంటాయి. పందెం కోళ్ల కోసం ప్రత్యేకంగా ఒక శాస్త్రమే ఉంది.

శాస్త్రాలు మనుషులకేనా.. కోళ్లకూ ఉంది!
శాస్త్రాలు మనుషులకేనా.. కోళ్లకూ ఉంది!

By

Published : Jan 13, 2021, 7:56 PM IST

వారం.. తిథి.. నక్షత్రం.. ఓన్లీ మనుషులకే అనుకుంటున్నారా? కాదు.. కాదు.. కోళ్లకి ఉంటుంది. ఏ జాతి కోడి ఎప్పుడు గెలుస్తుంది? ఏ నక్షత్రం.. కోడికి కలిసి వస్తుంది... ఇలాంటివి చాలనే ఉంటాయి. ప్రత్యేకంగా కోళ్ల పందాల కోసం కుక్కుట శాస్త్రం ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే... అది కోళ్ల పంచాంగం అనుకోండి. పందెం రాయుళ్లకు ఇదో గ్రంథం. మరి గెలవాలంటే.. అన్ని చూడాలిగా..!

కుక్కుట శాస్త్రం అనగా పందెం కోడిపుంజుల గురించి రాసిన పంచాంగం. సంస్కృత భాషలో కుక్కుటము అంటే కోడిపుంజు. కుక్కుట శాస్త్రాన్ని కోడి పందాలు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెం వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రం, కోడి పుంజు జాతకం లాంటి విషయాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అనేది స్పష్టత లేదు.

సంక్రాంతి పండగ రోజుల్లో పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి పందేలు వేస్తారు. 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు, 14వ తేదీ యాసర కాకి డేగలు, కాకి నెమలిలు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు, 15వ తేదీ డేగలు, ఎర్రకాకి డేగలు గెలుపొందుతాయని నమ్మకం.

ఏ రోజున ఏ దిశలో వదలాలంటే..

ఆదివారం, శుక్రవారాల్లో ఉత్తర దిశలో కోడిని పందానికి వదిలితే మంచిదని చెబుతారు. దక్షిణ దిశలో సోమవారం, శనివారం .. తూర్పు దిశలో మంగళవారం.. పడమదిశలో బుధవారం, గురువారం కోళ్లను పందానికి వదిలితే మంచిదని అంటుంటారు.

ఇదీ చదవండి:పందెం కోళ్లకు బ్రహ్మచర్యం తప్పదా?!

ABOUT THE AUTHOR

...view details