కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు వరదనీరు కృష్ణానదిలోకి వచ్చి చేరుతోంది. దీంతో ఈ సీజనులో తొలిసారిగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా ఆరు నుంచి ఏడు క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్లను తెరిచి 4,500 క్యూసెక్కులను తొలుత విడుదల చేశారు. ఆ తర్వాత క్రమంగా నీటి పరిమాణం పెంచుతున్నారు. ఉదయం కేసరి నుంచి నాలుగు వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది. అందులో 5,276 క్యూసెక్కుల నీటిని కృష్ణా తూర్పు డెల్టాకు... మరో 2,519 క్యూసెక్కుల నీటిని కృష్ణ పశ్చిమ డెల్టాకు విడుదల చేశారు.
అర్ధరాత్రికి కేసరి నుంచి 10 వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి 4 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల 14 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటుందని భావిస్తున్నారు. వర్షాలు పడుతున్నందున పట్టిసీమ పంపులను నిలుపుదల చేశారు. ప్రస్తుతం డెల్టా ఆయకట్టు పరిధిలో అధిక వర్షపాతం నమోదైనాీటి సరఫరాకు డిమాండ్ లేని కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది దిగువకు సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.