ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Children death: అప్పటిదాకా ఆడుకొని... అంతలోనే చెరువులో జారి పడి.. - కృష్ణా జిల్లాలో చెరువులోపడి చనిపోయిన చిన్నారులు

four-children-died-after-slipping-in-a-pond-while-playing
చెరువులో జారిపడి నలుగురు చిన్నారులు మృతి

By

Published : Oct 14, 2021, 5:58 PM IST

Updated : Oct 15, 2021, 4:23 AM IST

17:54 October 14

ఆ చిన్నారులు సరదాగా గడుపుదామని దసరా సెలవులకు ఊరికి వచ్చారు. ఆడుకోవడానికి అంతా కలిసి చెరువు దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తు జారి చెరువులో పడ్డారు. ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అప్పటిదాకా నవ్వుతూ ఆటలాడిన చిన్నారులు అంతలోనే..విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం వరహపట్నంలో జరిగింది.

       అమ్మమ్మ ఇంట్లో దసరా చేసుకోవాలని.. చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలతో ఆడుకోవాలని వచ్చిన ఆ చిన్నారులను చెరువు పొట్టనపెట్టుకుంది. పండగ వేళ పిల్లల సందడితో కళకళలాడాల్సిన కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. అమ్మమ్మ ఇంటికి వచ్చిన గంట వ్యవధిలోనే నలుగురు పిల్లలు మృతి చెందిన ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం వరహాపట్నం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. 

వరహాపట్నం గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిది సీతనపల్లి, మరొకరిది అల్లూరు. వీరిలో మొదటి కుమార్తె పిల్లలు వీరగాని నవ్యశ్రీ (10), కావ్యశ్రీ (11), అయ్యప్ప, రెండో కుమార్తె సంతానం లుక్కా వీరాంజనేయులు (6), నిఖిత (10) పండగకని గురువారం అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వెంకటేశ్వరమ్మ గ్రామ మంచినీటి చెరువు గట్టుపై పచ్చగడ్డి కోసేందుకు వెళ్లగా పిల్లలు ఆమె వెంట అనుసరించారు. వెంకటేశ్వరమ్మ పనిలో ఉండగా.. చిన్నారులు గట్టుపై ఆడుకుంటూ అయ్యప్ప తప్ప మిగిలిన నలుగురు చెరువులోకి దిగి మునిగిపోయారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వరమ్మ కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని బయటికి తీశారు. అప్పటికే ఓ బాలుడు, ఇద్దరు బాలికలు మృతిచెందారు. కొన ఊపిరితో ఉన్న కావ్యశ్రీని కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలొదిలింది. ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కైకలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం వరహాపట్నం, సీతనపల్లి, అల్లూరు గ్రామస్థులతో నిండిపోయింది.

ఇదీ చదవండి :      

GIRL MISSING: రైవస్‌ కాల్వలో బాలిక గల్లంతు.. గాలింపు చేపట్టిన అధికారులు

Last Updated : Oct 15, 2021, 4:23 AM IST

ABOUT THE AUTHOR

...view details