ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెన్నైకి తాగునీరు: ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకించిన తెలంగాణ - చెన్నై తాగునీటి సమస్యపై కేఆప్​ఎంబీ సమావేశం

Chennai Water Meeting : చెన్నైకి తాగునీటి సరఫరా కోసం శ్రీశైలం వద్ద ప్రత్యేక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రతిపాదనతో తెలంగాణ విభేదించింది. శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే భారీగా నీటిని తరలించినందున అందులో నుంచి చెన్నైకి నీరు ఇవ్వాలని సూచించింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో చెన్నై తాగునీటి కమిటీ ఆరో సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది.

చెన్నై తాగునీటి సమస్యపై కేఆర్ఎంబీ సమావేశం
చెన్నై తాగునీటి సమస్యపై కేఆర్ఎంబీ సమావేశం

By

Published : Dec 23, 2021, 10:46 PM IST

Chennai Water Meeting : చెన్నై తాగునీటి కమిటీ ఆరో సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు. తమకు మరో ఆరు టీఎంసీల నీరు విడుదల చేయాలని తమిళనాడు కోరింది. ఆ నీటిని శ్రీశైలం నుంచి ఇచ్చేలా చూడాలని ఏపీ ప్రతిపాదించింది.

దానిపై స్పందించిన తెలంగాణ.. ఈ ఏడాది ఇప్పటికే ఏపీ ఎక్కువ నీటిని కండలేరుకు తరలించినందున అక్కడి నుంచి చెన్నైకి నీరివ్వాలని తెలిపింది. ఏటా సమస్య ఉత్పన్నం కాకుండా శ్రీశైలం వద్ద ప్రత్యేకంగా ఎత్తిపోతల నిర్మించుకోవాలని తమిళనాడుకు ఏపీ సూచించింది. ఆ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కండలేరు నుంచి చెన్నై వరకు పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రాజెక్టు సవివర నివేదిక అందితే దానిపై తమ అభిప్రాయం చెబుతామని తెలంగాణ పేర్కొంది.

Chennai Drinking Water Issue : అటు చెన్నైకి తాగునీటి సరఫరా కమిటీ నుంచి తమను తప్పించాలని మహారాష్ట్ర, కర్ణాటక మరోమారు కోరాయి. చెన్నై అవసరాల కోసం తాము ఇవ్వాల్సిన ఐదు టీఎంసీల చొప్పున నీటిని తమ నికర జలాల కోటా నుంచి మినహాయించుకోవాలని ఆ రెండు రాష్ట్రాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details