ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కృష్ణమ్మ శుద్ధి సేవలో నేను సైతం' - krishna

కృష్ణా, గుంటూరు జిల్లాలో పరిధిలో లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరందిస్తున్న కృష్ణమ్మ మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కళావిహీనంగా మారింది. దీంతో కృష్ణా నదికి పూర్వ వైభవం తీకుకొచ్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కృష్ణమ్మ శుద్ధి సేవలో నేనుసైతం కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు.

కృష్ణమ్మ శుద్ధి సేవలో నేను సైతం

By

Published : May 2, 2019, 8:01 AM IST

విజయవాడలోని మెత్తం 15 ప్రాంతాల్లో కృష్ణమ్మ శుద్ధి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సారథ్యంలో ప్రారంభమైన మహత్తర కార్యంలో ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు పాల్గొన్నారు. కృష్ణా నది తీర ప్రాంత ప్రజలకు నదీ శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.ఎంతో మందికి జీవనాధారమైన నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచిస్తున్నారు. కాలుష్యం, మురుగు,ప్లాస్టిక్ పై యుద్ధం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రధాన కాల్వలలో వ్యర్థాలు లేకుండా నదికి పునర్వైభవం తీసుకురావాలసి పేర్కొన్నారు. ప్రజలలో అవగాహన లేకపోవడం వల్లే నది వ్యర్థాలతో నిండిపోయిందని అన్నారు. పదిరోజుల నుంచి ఈ కార్యక్రమంపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వ్యర్థాలు, ప్లాస్టిక్ లేని కృష్ణ నదిని చూడటమే తమ లక్ష్యమని వ్యాఖ్యనించారు. పోలీసు శాఖ తరపున తమ పూర్తి సహాకారం ఉంటుందని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. కార్యక్రమం ఎన్ని రోజులు జరిగినా పోలీసులు స్వచ్ఛందంగా పాల్గొంటారన్నారు.
ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details