'క్వారంటైన్లో ఉన్న వ్యక్తులపై మొబైల్ యాప్ నిఘా'
ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు హెచ్చరించారు. హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తులను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా నిఘా ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు.
'హోం క్వారంటైన్ వ్యక్తులపై మొబైల్ యాప్‌తో ప్రత్యేక నిఘా'
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు కృషి చేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు అన్నారు. జిల్లా వ్యాప్తంగా హోం క్వారంటైన్లో ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాప్ రూపోందించి దాని ద్వారా వారు ఇంట్లోనే ఉన్నారనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, వారు బయటకు వస్తే వెంటనే అలారం ద్వారా సిగ్నల్ వస్తుందన్నారు. అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.